ADB: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గుడిహత్నూర్ పోలింగ్ కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలులో ఉండగా గుమిగూడు ఉన్న 20 మందిపై, మన్నూర్ పోలింగ్ కేంద్రం నందు 10 మంది పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు, రంగులు చల్లుకోకూడదన్నారు. ఎవరిపై రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయొద్దన్నారు.