KDP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే డా.దాసరి సుధ బుధవారం డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. భారత రాజ్యాంగం అన్ని దేశాలలో కెల్లా అతి పెద్దదని, దేశంలోని ప్రతి వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ బలమైన వ్యవస్థగా తయారైందని ఆమె తెలిపారు.