SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అందగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.4,12,347 లక్షల చెక్కులను తన కార్యాలయంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్తోనే పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు.