KMR: బిక్కనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలుగు సబ్జెక్టుపై బిక్కనూరు, బీబీపేట్, దోమకొండ మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఎంఈవో రాజా గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సబ్జెక్టుపై ఉపాధ్యాయులు పట్టు సాధించి, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది తెలుగు భాష ఉపాధ్యా యులు పాల్గొన్నారు.