KNR: చారిత్రాత్మక కట్టడంగా ఉన్న జిల్లా సైన్స్ మ్యూజియం పురాతన భవనానికి పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని ప్రభుత్వ పురాతన పాఠశాలలో గల జిల్లా సైన్స్ మ్యూజియం ఆధునీకరణ పనులను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పరిశీలించారు.