ATP: నార్పల మండలంలోని సమస్యలపై స్థానిక నాయకులు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. టీడీపీ నేత ఆకుల విజయ్ కుమార్ మండలంలోని పలు సమస్యలను పల్లాకు వివరించారు. దీనిపై పల్లా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.