NLG: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు మోదీకి ప్రతిఘటన తప్పదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. నల్గొండ పట్టణంలోని సుభాష్ సెంటర్లో సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని అన్నారు.