WNP: గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు నవంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటలకల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై సమావేశం నిర్వహించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు నిర్దేశించిన పత్రాలు తీసుకురావాలని సూచించారు.