TG: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణి రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో నామినేషన్లు, భద్రత, పోలింగ్, ఎన్నికల కోడ్ అమలుపై చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో లోటుపాట్లు ఉండకూడదని దిశానిర్దేశం చేశారు.