W.G: రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీ ఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 26లోపు https:// apstudycircle.apcfss.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి 4 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు.