NRML: నిర్మల్ ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడిగా వెంక గారి భూమయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్లో నిజమైన జర్నలిస్టులకు, సీనియర్ జర్నలిస్టులకు గౌరవం లోపించిందని, దీంతో కలతచెంది తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ సభ్యుడుగా కొనసాగుతామన్నారు.