AP: YCP నేతలు మారకపోతే తనలోని మరో రూపాన్ని చూస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారని అన్నారు. రాజోలు గడ్డ నుంచి చెబుతున్నానని.. అది జరగదని పేర్కొన్నారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా క్షమించనని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారు జనసేనలో ఉన్నా బయటకు పంపిస్తానని స్పష్టం చేశారు.