AP: ఏలూరు జిల్లాలో 22ఏ భూములు ఎన్ని ఉన్నాయో అధికారులను వివరాలు కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 16న జిల్లాస్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు సంక్రాంతి నాటికి ఇస్తామన్నారు.