SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో జాతీయ రహదారి -16 పక్కన ఉన్న సర్వీస్ రోడ్డును కల్లాలుగా మార్చేశారు. వరి కోతల సమయం కావడంతో ఎక్కడా కల్లాలు లేకపోవడంతో రోడ్డునే కల్లాలుగా మార్చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు అంటున్నారు. తరచూ వాహనాలు స్లిప్ అవుతున్నాయని వారి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా కల్లాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.