ADB: ప్రభుత్వ రంగం సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ కె. నాగరాజు పేర్కొన్నారు. కేర్ ఫౌండేషన్, సైన్స్ ఇన్నోవేషన్ పేరుతో వెలుగులోకి వచ్చిన సరికొత్త జాబ్ ఫ్రాడ్‌ను పోలీసులు గుర్తించారు. పట్టణానికి చెందిన వ్యక్తి వద్ద నుండి లక్షల్లో డబ్బులు కాజేసారని తెలిపారు.