యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను తొలగించినట్లు తెలిపింది. మరణించిన వారి వివరాల ఆధారంగా ఈ నంబర్లను రద్దు చేశారు. అయితే ఒకసారి తొలగించిన ఈ నంబర్లను భవిష్యత్తులో మరెవరికీ కేటాయించబోమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.