పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం తెలంగాణ, APలో రూ.130 కోట్లకుపైగా బిజినెస్ జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.