కేంద్ర కేబినెట్ భారీ నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.19,919 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా పూణె మెట్రో విస్తరణ కోసం రూ.9,858 కోట్లు కేటాయించింది. అలాగే ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్’ తయారీ పథకానికి రూ.7,280 కోట్లు మంజూరు చేసింది. మౌలిక వసతులు, తయారీ రంగం బలోపేతమే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించారు.