KNR: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజ్యాంగ పరిరక్షణకు అందరు కట్టుబడి ఉండాలని జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి సూచించారు. ఆయన డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాజరైన ఉద్యోగులు, పట్టణ ప్రజలతో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది రాజ్యాంగమేనని ఆయన పేర్కొన్నారు.