WNP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెబ్బేరులోని మత్స్యశాఖ కళాశాలలో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ.. అధికరణ 32 రాజ్యాంగానికి గుండె వంటిది అని అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి 32 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చుని తెలియజేశారు.