NRML: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని అధికారులకు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కులను కాపాడే మహత్తరపత్రంగా నిలిచిందన్నారు.