SKLM: జిల్లా చేనేత సొసైటీల ప్రతినిధులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని చేనేత శాఖ మంత్రి సవితను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. నేతన్నల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.