హాంకాంగ్‌లోని భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 13కు చేరగా, 15 మంది గాయపడ్డారు. 31 అంతస్తుల ఎత్తున్న 8 టవర్లలో మంటలు వ్యాపించడంతో.. లోపల వందలాది మంది చిక్కుకున్నారు. దాదాపు 4,600 మంది నివసిస్తున్న ఈ సముదాయంలో మంటలను అదుపు చేసేందుకు 700 మంది ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.