TG: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రశ్నించనున్నట్లు సమాచారం. సోమవారం ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో స్వయంగా నిందితుడిని విచారించటం ఇదే తొలిసారి.