TG: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రాత్రిపూట రాష్ట్రవ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు చలి తీవ్రత ఉండనుంది. రెండు రోజులూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’ అలెర్ట్ జారీ చేసింది.