SKLM: జిల్లా వ్యాప్తంగా అభ్యుదయం సైకిల్ యాత్రపై ప్రజల్లో విశేష ఆదరణ లభించడంతో జనవరి 3 వరకు కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఆదే శాల మేరకు మాదక ద్రవ్యాలపై ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.