MBNR: జనవరి రెండవ తేదీ నుంచి పర్వతాపూర్ మైసమ్మ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఈవో శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. రెండవ తేదీన మహాగణపతి పూజ, మూడవ తేదీన అలంకారం, నాలుగవ తేదీన కవచధారణ, ఐదవ తేదీన ఆహ్వానం అగ్నిస్థాపన, చండీ హోమం, పుణ్యాహవాచనం, పూర్ణాహుతి, ఆరవ తేదీన బండ్ల ఊరేగింపు, శకటోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు.