HYD: నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేళ, మహిళ భద్రత కోసం షీ టీమ్స్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. HYDలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. షీ టీమ్స్ నిఘాను DEC 31, JAN 1న పెంచనున్నారు. మహిళలను, యువతులను వేధించినా..? మత్తు మైకంలో అసభ్యకరంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని WSW హెచ్చరించింది.