ATP: కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఈనెల 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలు అందజేయవచ్చన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల సమాచారం కోసం 1100 కాల్ సెంటర్ లేదా మీకోసం వెబ్సైట్ను వినియోగించుకోవాలని సూచించారు.