NGKL: వివిధ కారణాలతో క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల రక్షణ కోసం ఈనెల 23న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.