NRPT: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్ అదాలత్తో మొత్తం 5,509 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ.26,90,889 ఆదాయం సమకూరిందని చెప్పారు. లోక్ అదాలత్తో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులకు కృతజ్ఞతలు తెలిపారు.