NRPT: ఐక్య రాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నారాయణపేట అగ్రహార్పేట్ పురాతన బొప్పలమఠంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుర్మిట్కల్ ఖాసా మఠం పీఠాధిపతి గురు మృగ రాజేంద్ర మహాస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవచనం చేశారు. యోగా, ధ్యానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.