ప్రకాశం: ఒంగోలులోని రిమ్స్ వైద్యశాల వద్ద భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రిమ్స్ వైద్యశాలలో పనిచేస్తున్న అలేఖ్య అనే ఉద్యోగినిని, ఆమె భర్త భాష కొద్దిసేపు గొడవ పడ్డారు. ఈ క్రమంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకుని, అలేఖ్యను వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.