CTR: ఐరాల మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన లేట్ రాదయ్య కుమారుడు లక్ష్మయ్య (40) కనిపించడం లేదని కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్లు S1 జయశ్రీ శనివారం తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఈ వ్యక్తి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, ఎవరైనా అతడిని గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.