ఢిల్లీ పేలుడు బ్లాస్ట్ కేసులో NIA కీలక ముందడుగు వేసింది. ఫరీదాబాద్‌లో 7వ నిందితుడు సోయాబ్‌ను అరెస్టు చేయగా.. పాటియాలా హౌస్ కోర్టు అతన్ని 10 రోజుల NIA కస్టడీకి పంపింది. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు అమీర్ రషీద్ అలీ కస్టడీని కూడా కోర్టు 7 రోజులు పొడిగించింది. పేలుడు వెనుక ఉన్న కుట్ర కోణాలపై NIA అధికారులు వీరిని విచారించనున్నారు.