GDWL: గద్వాల మండలం అనంతపురం గ్రామంకు అక్రమంగా ఆటోలో మద్యం తరలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఇవాళ రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహనాన్ని తనిఖీ చేయగా 18 మద్యం కాటన్ బాక్సులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతి పత్రాలను పరీక్షించగా అనుమానం రావడంతో సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. జిల్లాలో మద్యం తరలిస్తే కట్టిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.