మహిళల అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.