జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా ఇటీవల నూతనంగా నియమితులైన శేషాద్రిని రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్‌ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన విధులను నిర్వర్తించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు.