ELR: జంగారెడ్డిగూడెం సూర్య కాలేజీలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఈ మేళాకు 253 మంది అభ్యర్థులు హాజరు కాగా, 17 కంపెనీలు పాల్గొన్నాయి. వీరిలో 107 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఈఎసీసీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.