NZB: ఆహార కల్తీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్బీ అన్నారు. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా నగరంలోని గంగాస్థాన్లో గల వివేకానంద మఠంలో బుధవారం చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్య జీవితంలో పాల వాడకం తప్పనిసరిగా మారిపోయిందన్నారు.