2030 శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులు భారత్ దక్కించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజల విజయమని పేర్కొన్నారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక క్రీడలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్ సత్తా చాటిందని, ప్రపంచాన్ని స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మోదీ పోస్ట్ చేశారు.