SKLM: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. రాగోలులోని జేమ్స్ హాస్పటల్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బుధవారం హాజరయ్యారు. ఆరోగ్య రంగంలో విశేష సేవలు చేస్తున్న ఈ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమణమూర్తి, ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.