అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్ గెలవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇది PM మోదీ దార్శనికతకు నిదర్శనమన్నారు. భారత్‌ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చేందుకు మోదీ చేసిన కృషి ఫలితమే ఇదన్నారు. గత పదేళ్లలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, సమర్థవంతమైన పాలన వల్లే దేశ సామర్థ్యం పెరిగిందని, ఈ విజయం ప్రతి పౌరుడిదని షా పేర్కొన్నారు.