ELR: ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం పోటీల్లో పెదనిండ్రకొలనులోని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుర్రాల కీర్తన ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని కలెక్టర్ వెట్రీ సెల్వి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంది. కీర్తనను డీఈవో వెంకట లక్ష్మమ్మ, ఎంఈఓలు అనురాధ, శేషగిరి రావు అభినందించారు.