భారత్‌కు అరుదైన అవకాశం దక్కింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ ఖరారైంది. గ్లాస్గోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో ఢిల్లీ తర్వాత భారత్‌లో ఈ క్రీడలు జరగడం ఇది రెండోసారి. 2030 నాటికి ఈ గేమ్స్ మొదలై వందేళ్లు పూర్తవుతుండటం విశేషం. ఇందులో మొత్తం 15 – 17 క్రీడల్లో పోటీలు ఉంటాయని IOA తెలిపింది.