W.G: నరసాపురం మండలం పెదమైనవాని లంకలో బుధవారం కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి.వాసు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు కోడి పుంజులు, మూడు ఫోన్లు, రెండు కత్తులు, రూ.1,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.