GNTR: వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడిలో బుధవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం రైతులను ఆదుకునే నిజమైన కవచమని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లను వినియోగించుకోవాలని సూచించారు. తమకు రైతే దైవమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.