KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని రాచగుడి పల్లెలో భూమి వివాదం మళ్లీ రగిలిందని మండల బీజేపీ నేత రుద్రరాజు భాను ప్రకాశ్ రాజు తెలిపారు. 2014లో కేటాయించిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు. గ్రామస్తులతో కలిసి బుధవారం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.