KKD: అన్నదాతల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం మురారిలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు