ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి సుమారు 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇబ్రహీంపట్నంకి చెందిన వారుగా సమాచారం. నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.